సమస్యలు పరిష్కారించాలని డిమాండ్
సాక్షి, పాడేరు: ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం ఎదుట సోమవారం నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అవలింబిస్తున్న ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను వారంతా నిరసించారు.నల్లబ్యాడ్జీలు ధరించే స్పాట్ విధుల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఫ్యాఫ్టో చైర్మన్ రావుల జగన్‌మోహనరావు,ప్రధాన కార్యదర్శి పి.కర్రన్న మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, 30శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యలను పరిష్కరించడంతో పాటు సీపీఎస్,జీపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని వెంటనే అమలుజేయాలని కోరారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఇతర కార్యక్రమాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఎంటీఎస్ టీచర్ల పదవీవిరమణ వయస్సును 60 నుంచి 62ఏళ్లకు పెంచాలని,హైస్కూల్ ప్లస్‌లో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని,ఎంఈవోలతో పాటు ఎంఈవో,హెచ్‌ఎంల పరస్పర బదిలీలు, ఎంఈవో–1,ఎంఈవో–2 జాబ్ చార్ట్‌లో అసంబద్ధాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మహేశ్వరరావు,గిడ్డి వరలక్ష్మి,వెంకటరమణనాయుడు, వల్ల వెంకటరమణ,రాంబాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


