చింతపల్లి: స్థానిక గ్రామదేవత ముత్యాలమ్మ జాతరను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క రూ సహరించాలని ఉత్సవ కమిటీ చైర్మన్ పసుపులేటి వినాయకరావు ప్రధాన కార్యదర్శులు పోతురాజు బాలయ్యపడాల్, దురియా హేమంత్‌కుమార్ కోరారు.ముత్యాలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై ఎస్‌ఐ వెంకటరమణతో కలసి ఉత్సవ కమిటీ సభ్యులు సోమవారం పలు ప్రాంతాలను సందర్శించారు. విద్యుత్‌దీపాలంకరణ, ఎగ్జిబిషన్ ప్రాంతాలలో సందర్శకులకు ఇబ్బందిలేకుండా చేపట్టవలసిన అంశాలను పరిశీలించారు. ఉత్సవ కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ ప్రతి ఏడాదికి భిన్నంగా పట్టణంలోని అన్ని వీధుల్లో విద్యుత్ దీపాలంకరణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.మూడు స్టేజీలను ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఎగ్జిబిషన్‌ను బస్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించినట్టు చెప్పారు. మండలంలోగల అన్ని శాఖల ఉద్యోగుల తో సమావేశమై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందేకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదిరెడ్ల బేతాళుడు,కమిటీ సభ్యులు తాడి రమణ, పైలా శ్రీనివాసరావు, లోవ,శ్రీను,సత్యనారాయణ,దార పాల్గొన్నారు.


