అలలపై విద్యుత్‌ కాంతులు | - | Sakshi
Sakshi News home page

అలలపై విద్యుత్‌ కాంతులు

Apr 6 2026 7:30 AM | Updated on Apr 6 2026 7:30 AM

సాగర తీరాన ఆదివారం రాత్రి ఒక అద్భుత దృశ్యం పర్యాటకులను కట్టిపడేసింది. సముద్ర అలలపై రంగురంగుల విద్యుత్‌ దీపాలతో జిగేల్‌మంటూ కనిపిస్తున్న ఈ ఓడ కేవలం అలంకారానికే పరిమితం కాదు, తీర రక్షణలో దీని పాత్ర అత్యంత కీలకం. ప్రతి ఏటా తీర ప్రాంతంలో జరిగే భూకోతను అరికట్టేందుకు, సముద్ర గర్భంలోని ఇసుకను తవ్వి తిరిగి తీరానికి చేర్చే ‘డ్రెడ్జింగ్‌’ ప్రక్రియలో ఈ నౌకను వినియోగిస్తారు. రాత్రి వేళ తన విధి నిర్వహణలో భాగంగా విద్యుత్‌ కాంతులతో వెలుగులీనుతున్న ఈ డ్రెడ్జర్‌, చీకటి సముద్రంపై ఒక అందమైన దీపంలా మెరుస్తూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement