మునగపాక: దళితజాతి సముద్దరణ కోసం తపించిన మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్‌రామ్ ఒక్కరే అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమం ఆదివారం మునగపాకలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలన్నారు. అంబేడ్కరిజమ్ పునాది అసోసియేషన్ కన్వీనర్ రాజాన బుజ్జిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోనపల్లి రామ్మోహనరావు, పెంటకోట సారథి, ఎస్సీ సెల్ విభాగం మండల అధ్యక్షుడు దిమ్మల శివ, పెంటకోట శ్రీనివాసరావు, ఆడారి రమణబాబు,కాండ్రేగుల రాజు, భీశెట్టి ఈశ్వరరావు పాల్గొన్నారు. నాగులాపల్లి జగ్జీవన్‌రామ్ కాలనీలో జరిగిన జయంతి కార్యక్రమంలో అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దొడ్డి శ్రీనివాసరావు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించారు. ఎంపీటీసీ చిందాడ దేవి, పొలమరశెట్టి నాగు,గోసాల గోవింద, పొలమరశెట్టి నూకాలయ్య, డొక్కా శివకుమార్, రాజు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్


