నూతన పద్ధతుల సాగుపై అవగాహన
రంపచోడవరం: ఏజెన్సీలోని గిరిజన రైతులు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజుల అన్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన రైతులతో మాట్లాడారు. కెవీకె ద్వారా రైతులకు అనేక రకాలైన సేవలు అందుతున్నాయని, ఎటువంటి సమస్యలు, సాగు విధానాలపై శాస్త్రవేత్తలను కలిసి అవగాహన పెంచుకోవాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా రైతులు ముందడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా 50 మంది గిరిజన రైతులకు ఉచితంగా బరకాలు, కొబ్బరి మొక్కలను అందజేశారు. కెవీకె కోఆర్డినేటర్ డా. రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్తలు వీరాంజనేయులు, పుష్ఫవతి, ప్రవీణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రాజ్‌మా సాగు విస్తీర్ణాన్ని పెంచాలి
గూడెంకొత్తవీధి: గిరిజన ప్రాంతానికే ప్రత్యేకమైన రాజ్‌మా పంట విస్తీర్ణాన్ని రైతులు పెంచాలని గూడెంకొత్తవీధి మండల వ్యవసాయాధికారి గిరిబాబు అన్నారు. జాతీయ ఆహారభద్రతా పథకంలో భాగంగా బుధవారం మండలంలోని అసరాడ గ్రామంలో రాజ్‌మా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. రైతులు సాగు విస్తీర్ణం పెంపుతోపాటు ఆచరించాల్సిన విధానాలను వివరించారు. 90 శాతం రాయితీపై వేపనూనెను రైతులకు పంపిణీ చేశారు. సర్పంచ్ లక్ష్మి, మార్కెట్‌కమిటీ డైరెక్టర్ శరభన్నపడాల్ నాయకులు రంగారావు, వీఏఏ సౌందర్య తదితరులు పాల్గొన్నారు.
నూతన పద్ధతుల సాగుపై అవగాహన


