రీసర్వే, మ్యుటేషన్ ప్రక్రియ వేగవంతం
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : రీ సర్వే, మ్యుటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌నుంచి ఆర్డీవోలు, అన్ని మండలాల సర్వే అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. డీ పట్టా భూమి, ఆర్‌వోఎఫ్‌ఆర్ , జిరాయితి భూమిలో సాగు చేసే ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందేలా చూడాలని ఆదేశించారు. రీ సర్వే సమయంలో ప్రభుత్వ, డి పట్టా భూములను పూర్తిగా పరిశీలించాలన్నారు. వెబ్‌ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలని వాటిపై తిరిగి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. ఒకటి రెండు సార్లు పరిశీలించిన తరువాత మాత్రమే పట్టాలు జారీ చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులను త్వరితిగతిన పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఉత్తరు్‌ువ్ల ఈఆఫీస్ ద్వారా డాక్యుమెంట్ అప్లోడ్ డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేసి ఆప్లికేషన్లను క్లియర్ చేయాలన్నారు. నాలా పన్నులు వసూలు (వాటర్ టాక్స్) ప్రక్రియ కూడా వేగవంతం చేయాలన్నారు. తహసీల్దార్లు పనుల వసూళ్లను వెంటనే ప్రారంభించాలన్నారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్ కానీ నియోజకవర్గాల్లో బీఎల్వోలు, సూపర్‌వైజర్లు త్వరగా పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే అందుకు తగిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు స్మరణ్‌రాజ్, శుభం నొఖ్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇంచార్జీ డీఆర్వో అంబేడ్కర్, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు.


