థింసా నృత్యంతోపర్యాటకులకు వినోదం
● భీమనాపల్లిలో ప్రదర్శన వేదిక ఏర్పాటు
● స్వయం ఉపాధి పొందుతున్నఆదివాసీ మహిళలు
చింతపల్లి: ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో ఆదివాసీలు థింసా నృత్యంతో పర్యాటకులకు పంచుతున్నారు. మరోవైపు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆదివారం ఐటీడీఏ, పంచాయతీ సహకారంతో ఆదివాసీ గిరిజన థింసా కమిటీ ఆధ్వర్యంలో చెరువులవేనం ముఖధ్వారం భీమనాపల్లిలో ప్రదర్శన వేదిక ఏర్పాటుచేశారు. దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ నృత్యాన్ని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు ప్రదర్శిస్తారని కమిటీ తెలిపింది. ఈ ప్రదర్శన వీక్షించేందుకు పర్యాటకుల నుంచి నిర్వాహక కమిటీ రూ.30 వసూలు చేస్తోంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఆదివాసీ మహిళలతో కలిసి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహక కమిటీ చైర్మన్ బొబ్బిలి కామేశ్వరరావు, వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచ్, కొర్ర శాంతి, మాజీ సర్పంచ్ రఘునాథ్, వీఆర్వో సధానందరావు, పీసీ కమిటీ ఉపాధ్యక్షుడు బలరామ్ పాల్గొన్నారు.


