జిల్లా ఆస్పత్రికి ఓఎన్జీసీ వితరణ
● ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లుఅందజేత
పాడేరు : సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓఎన్జీసీ సంస్థ (రాజమహేంద్రవరం) సీఎస్సార్ నిధుల నుంచి పాడేరు జిల్లా ఆస్పత్రికి 40 ఆక్సిజన్ సిలిండర్లు, 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో వీటిని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమలతకు ఓఎన్జీసీ సంస్థ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్మోహన్ అందజేశారు. వీటిని ఆపరేషన్ థియేటర్లు, ఎన్‌ఎన్‌సీయూ. క్యాజువాలల్టీ విభాగాలతో పాటు అత్యవసర అంబులెన్స్ విభాగాల్లో వినియోగించాలని ఆస్పత్రి నిర్వాహకులను ఆయన కోరారు.


