ఆదివాసీలతోనే ఉద్యోగాల నియామకం
● ఆదివాసీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు డిమాండ్
● పాడేరులో రాష్ట్ర మహాసభ నిర్వహణ
పాడేరు రూరల్: గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలతోనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆదివాసీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు డిమాండ్ చేశారు. పట్టణంలోని కాఫీ బోర్డు అతిథి గృహంలో ఆదివారం జరిగిన ఆదివాసీ ఉపాధ్యాయ(ఉద్యోగుల)సంఘ రాష్ట్ర మహసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు చట్టాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో అన్నిరంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియమాకాలు ఆదివాసీలతోనే భర్తీ చేయాలని కోరారు. గిరిజన ప్రాంతంలో సర్వం హక్కులు ఆదివాసీలకు ఉన్నప్పటికీ ఉద్యోగ నియామకాల్లోయ మాత్రం తీవ్ర ఆన్యాయం చేస్తున్నారన్నారు. హక్కులు, చట్టాలను కాపాడాల్సిన పాలకులే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆదివాసీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీచట్టాలు సక్రమంగా అమలు జరగటం లేదన్నారు. తెలంగాణ ఆదివాసీ ఉపాధ్యాయ(ఉద్యోగుల) సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయబాబు మాట్లాడుతూ మన హక్కులు చట్టాలపై ఆదివాసీ ఉద్యోగ, ప్రజా,విద్యార్థి సంఘాలు ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన విధానాలతో ఉద్యోగులను తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారన్నారు, ఇటీవల కాలంలో ఏపీలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులను రాత్రి బస చేసి విద్యార్థుల ఆరోగ్య, ఇతర ఆంశాలతో ముడిపెట్టి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నరన్నారు. నూతన విధానాలతో కూడిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక
జిల్లా ఆదివాసీ ఉపాధ్యాయుల సంఘం కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా సరియం అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా కణివి రామకృష్ణ, ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఏలూరు, జిల్లాల నుంచి ఉపాధ్యాయ సంఘాల (ఆదివాసీ జేఏసీ నేతలు శేషాద్రి, రామారావుదొర, రాంబాబు, కేశవరావు, సూర్యనారాయణపడాల్, సిద్ధేశ్వరావు, భాస్క రరావు పాల్గొన్నారు


