విహారంలో విషాదం
పాడేరు : సెలవు కావడంతో స్నేహితులతో విహారానికి బయలుదేరిన విద్యార్థిని మృత్యువు రోడ్డు ప్రమాదరూపంలో కబళించింది. చింతలవీధి సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నా యి. చింతపల్లి మండలం తా జంగి గ్రామా నికి చెందిన రామ్ బలభద్ర పాడేరు మండలం కందమామిడిలోని బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక బీవీకే పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో వంజంగి మేఘాల కొండకు బైక్‌పై స్నేహితులను ఎక్కించుకొని బయలుదేరాడు. చింతలవీధి జంక్షన్ వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో విద్యార్థి రామ్‌బలభద్ర మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి మృతితో తాజంగి, కందమామిడి ప్రాంతాల్లో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వంజంగి కొండకు బయలుదేరిన
విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి
మరో ఇద్దరికి గాయాలు
బైక్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఘటన
కుటుంబ సభ్యులు, బంధువులు
కన్నీరుమున్నీరు
విహారంలో విషాదం


