ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
గంగవరం : ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మండలంలో కొమరవరం, కుసుమరా యి గ్రామాల్లో ఆదివారం చైతన్య సదస్సులు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన ఆదివాసీల హక్కులు, చట్టాల పై అవగాహన కల్పించారు. 1/70 చట్టం ఆదివాసీలకు రక్షణ కవచంగా ఉందన్నారు. ఏజెన్సీలో సరైన రహదారి సౌకర్యం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని, దీంతో అత్యవసర సమయాల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురికావా ల్సి వస్తోందని చెప్పారు. ఆదివాసీ గూడెల్లో నెలకొన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతి నిధులు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చోడి ప్రదీప్ కుమార్ దొర, పిటా ప్రసాద్, కంగాల అబ్బాయి దొర, చోడి ఏడుకొండల రావు దొర, కలముల ప్రసాద్, హనుమంత్ రెడ్డి, శ్రీను, జోగిరాజు తదితరులు పాల్గొన్నారు.


