నేడు ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిషేధం
● పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్
పాడేరు : మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం పాడేరు డివిజన్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, ఇతరాత్ర ఆందోళన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేదని పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే పోలీసులనుంచి ముందస్తు అనుమతి పొంది 100 మందికి మించకుండా నిర్వహించాలన్నారు. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎక్కువ మందితో ఆందోళన కార్యక్రమాలు చేసి శాంతిభద్రతలు, ప్రజా భద్రతలకు, ప్రజా రవాణాకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


