ఏవోబీలో పోలీసుల అప్రమత్తం
మిగతా 10వ పేజీలో
● నేడు మావోయిస్టుల భారత్ బంద్
నేపథ్యంలో విస్తృత తనిఖీలు
● గాలింపు చర్యల్లో బలగాలు
సాక్షి,పాడేరు: వరుస ఎన్‌కౌంటర్లు, పోలీసు నిర్బంధానికి నిరసనగా మావోయిస్టు పార్టీ ఈనెల 24వ తేదీ శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో వారి నుంచి ఒక్కసారిగా బంద్ ప్రకటించడంతో తనిఖీలు ముమ్మరం చేశాయి.
● ఏవోబీతోపాటు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో పోలీసు బలగాలు కూంబింగ్ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ,జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలను పోలీసులు విస్తృతం చేశారు. ప్రధాన రోడ్లతో పాటు మారుమూల ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని వాహనాలను పోలీసు బలగాలు తనిఖీ చేశాయి.అనుమానిత వ్యక్తుల లగేజీ బ్యాగులను సోదా చేయడంతో పాటు వారి సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు.
● మావోయిస్టులు తలపెట్టిన భారత్ బంద్‌ను భగ్నం చేసే లక్ష్యంగా పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏవోబీ వ్యాప్తంగా పోలీసు బలగాలు గాలింపు చేపడుతుండగా, అటువైపు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బస్‌స్టేషన్లు, కొత్తవలస–కిరండూల్ లైన్‌లోని అన్ని రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక బలగాలు మోహరించాయి. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్లతో నిశితంగా పరిశీలిస్తున్నాయి.
రాత్రి పూట అంతర్రాష్ట్ర
బస్సు సర్వీసులు నిలిపివేత
సీలేరు: ఆంధ్రా ఒడిశా సరిహద్దు సీలేరు ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో ఎస్‌ఐ యాసిన్ ఏరియా డామినేషన్, వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి ఎటువంటి సాయం చేయవద్దని ఎస్‌ఐ సూచించారు. బంద్ ప్రకటన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ధారాలమ్మ తల్లి ఘాట్ రోడ్, సీలేరు మీదుగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లే రాత్రిపూట బస్సు సర్వీసులను ముందు రోజు నుంచి అధికారులు నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి సీలేరు నైట్ హాల్ట్ బస్సు, విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే నైట్ సర్వీసు, రాజమండ్రి నుంచి సీలేరు వచ్చే నైట్ బస్సును ఆర్టీసీ అధికారులు
మావోయిస్టుల భారత్‌బంద్‌తో జిల్లా వ్యాప్తంగా గట్టి భద్రత ఏర్పాటుచేశామని ఎస్పీ అమిత్‌బర్దర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రవేశద్వారాలు, ముఖ్యమైన చోట వాహనాల తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు.మావోయిస్టుల బంద్‌తో ప్రజలు భయపడవద్దని, రోజువారి పనులు సాధారణంగా చేసుకోవాలన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకువెళ్లాలని సూచించారు. తనిఖీల సమయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అలాగే పోలీసులకు ప్రజలు తోడుగా ఉండి, శాంతిని కాపాడాలని, అత్యవసర పరిస్థితుల్లో112కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
గట్టి భద్రత: ఎస్పీ అమిత్ బర్దర్


