జి.మాడుగుల యూబీఐలో మంటలు
జి.మాడుగుల: స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. బ్యాంక్ సెలవు కావడంతో సెక్యూరిటీ గార్డు ఒక్కరే కాపలాగా ఉన్నారు. బ్యాంక్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అతను వెంటనే బ్యాంక్ మేనేజర్, ఇతర సిబ్బందికి ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. బ్యాంక్ తాళాలు తీయడంతో స్థానిక యువకుడు కొర్రా క్రాంతి కుమార్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌నుంచి సరఫరా నిలిపివేశాడు. బ్యాంక్‌లో ఉన్న అగ్నిమాపక సిలిండర్లతో మంటలను అదుపుచేశాడు. అప్పటికే బ్యాంక్ క్యాబిన్‌లో కంప్యూటర్ సిస్టమ్, ప్రింటర్, ఏసీ, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. బ్యాంక్ ఇన్‌చార్జి మేనేజర్ జీవన్, ఎస్‌ఐ షణ్ముఖరావు సంఘటన స్థలానికి వచ్చి అగ్నిప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో
బ్యాంక్‌లో పరికరాలు దగ్ధం
జి.మాడుగుల యూబీఐలో మంటలు


