కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన
అరకులోయటౌన్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో తీవ్రనష్టమని జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి అన్నారు. మండలంలోని మారుమూల ఇరగాయి పంచాయతీ ఉరుములు గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా జెడ్పీటీసీ సభ్యురాలు రోషిణి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యతో పాటు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య కళాశాలలు నిర్మాణం చేడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తగదన్నారు. కూటమి సర్కారు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటుపరం చేయడంతో పేదలకు వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మిగులుతుందన్నారు. రాష్ట్రంలోని పేదలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని జెడ్పీటీసీ రోషిణి డిమాండ్ చేశారు. ఇరగాయి సర్పంచ్ మాదల బుటికి, ఎంపీటీసీ జన్ని చెల్లమ్మ, ఉమ్మడి విశాఖజిల్లా ఎస్టీసెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, సీనియర్ నాయకులు నాగేష్, బొంజుబాబు, గిరిజనులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ కిల్లోగుడ గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్ మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేసే వరకూ పోరాడుతూనే ఉంటామన్నారు. వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు, ఎంపీటీసీలు కూడా పాపారావు, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కె హరి, గుంటసీమ సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శులు మఠం శకంర్, లీలారాణీ, హెచ్.బి.రామునాయుడు, మాజీ ఎంపీటీసీ మహాదేవ్, నాయకులు సింహాచలం, మోహన్‌రావు, నరసింగరావు, గురునాయుడు, సుమన్, నామమూర్తి, ప్రసాద్, గంగాధర్, సుందర్‌రావు పాల్గొన్నారు.
జి.మాడుగుల: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగర్భ పంచాయతీ రోలంగిపుట్టు,చేపల్లి,పొర్లు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు చిట్టిబాబు, మసాడి గంగరాజు, పెదలువ్వాసింగి పంచాయతీ వంచేబు గ్రామంలో మాజీ సర్పంచ్ గబ్బాడి పండుదొర అధ్వర్యంలో ఆదివారం కోటి సంతకాలు కార్యక్రమం జరిగింది. గత వైస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో నిర్మించిన మెడికల్ కాలేజీల వివరాలతో కూడిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరమవుతుందని, ఫీజులు భరించలేనంతగా పెరుగుతాయన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులో లేకుండా పోతుందని ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుందని వారు చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వరంగంలోనే నడవాలని, ప్రజానిధులతో నిర్మించిన భవనాల ఆస్పత్రుల పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలని వారు డిమాండ్ చేశారు. నాయకుడు చంటిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గూడెంకొత్తవీఽధి: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతరేకంగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రింతాడ పంచాయతీ అసరాడలో ఆదివారం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పలాసి చిన్నారావు,దేశగిరి వీరన్నపడాల్, చినతల్లి, మురళీ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన
కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన
కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన
కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన


