మాజీ ఎమ్మెల్యే దేముడుకు ఘన నివాళి
● వెలగలపాలెంలోని స్మ ృతి వనం వద్ద వర్థంతి ● నిర్వహించిన కుటుంబ సభ్యులు ● ప్రజలకు ఎనలేని సేవలు: అరకు మాజీ ఎంపీ మాధవి
కొయ్యూరు: మాజీ ఎమ్మెల్యే దివంగత గొడ్డేటి దేముడు ప్రజలకు ఎనలేని సేవలు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అరకు మాజీ ఎంపీ మాధవి అన్నారు. ఆదివారం వెలగలపాలెంలోని ఆయన స్మ ృతి వనం వద్ద పదో వర్థంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. అనేక భూ పోరాటాలను సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారని తెలిపారు. అల్లూరి,అనకాపల్లి జిల్లా సీపీఐ కార్యర్శులు పొట్టిక సత్యనారాయణ, మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ పేదల బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. దేముడు విగ్రహానికి ఎంపీతోపాటు ఆమె సోదరుడు మహేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇరువాడ దేముడు, రావణాపల్లి ఎంపీటీసీ ఐ.సత్యవేణి, గురుబాబు, మాజీ సర్పంచ్ గుమ్మా రాంబాబు, నీలాపు సూరిబాబు పాల్గొన్నారు.


