చింతూరులోరికార్డు స్థాయి ప్రసవాలు
● ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌డాక్టర్ కోటిరెడ్డి
చింతూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఈనెలలో రికార్డు స్థాయిలో వంద ప్రసవాలు జరిగినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో గైనకాలజిస్టులు అందుబాటులోకి వచ్చిన తరువాత కాన్పుల సంఖ్య పెరిగిందన్నారు. ఈ ఏడాది జనవరిలో 64, ఫిబ్రవరిలో 48, మార్చిలో 50, ఏప్రిల్‌లో 68, మేలో 48, జూన్‌లో 54, జూలైలో 50, ఆగస్టులో 92, సెప్టెంబర్‌లో 95, అక్టోబర్‌లో 100 కాన్పులు నిర్వహించినట్లు కోటిరెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో ఖాళీగావున్న వైద్యనిపుణుల పోస్టులు భర్తీచేస్తే మరింత మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో కాన్పులు నిర్వహించిన ఆస్పత్రి వైద్యులను ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య అభినందించారు.


