ఉత్పత్తి మెండుగా..
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు లోయర్ సీలేరు ప్రాజెక్ట్ పరిధిలోని జలాశయాలకు మేలు చేశాయి. నిండుకుండను తలపిస్తున్నాయి. మొత్తమ్మీద ప్రస్తుతం రోజుకు 15,685 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. గత రెండేళ్లలో నాలుగు జలవిద్యుత్‌కేంద్రాలు లక్ష్యానికి అనుగుణంగా ఉత్పాదన సాధించాయి.
ప్రాజెక్టులు నిండుగా..
లక్ష్యానికి చేరువైన నాలుగు జలవిద్యుత్ కేంద్రాలు
ఆంధ్రా–ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న
బలిమెల జలాశయం
మోతుగూడెం: లోయర్ సీలేరు ప్రాజెక్ట్ పరిధిలోని జలాశయాల నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. దీంతో జలవిద్యుత్‌తోపాటు గోదావరి డెల్టా సాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఏపీ జెన్‌కో అధికారవర్గాలు పేర్కొన్నాయి.
● ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్‌లైన జోలాపుట్టు, బలిమెల జలాశయాల్లో ఆంధ్రా వాటాగా 64 టీఎంసీలు ఉన్నట్టు ఇరు రాష్ట్రాల అధికారులు లెక్క తేల్చారు. మొత్తంమీద డొంకరాయి, గుంటవాడ జలాశయాలతో కలుపుకుని 78 టీఎంసీలు ఉన్నట్టుగా జెన్‌కో అధికారులు నిర్థారించారు. రబీలో గతేడాది గోదావరి డెల్టాకు 60 టీఎంసీలు విడుదల చేశారు.
● కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జోలాపుట్టు, బలిమెల, గుంటవాడ, డొంకరాయి, పోర్‌బే జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. వీటిలో 120 టీఎంసీలు నిల్వ ఉండగా రోజుకు 15,685 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఇప్పటికే జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. బలిమెల జలాశయం మరో పది అడుగులకు చేరువలో ఉంది. మరో ఐదు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. డొంకరాయి ప్రాజెక్ట్‌కు వరద తాకిడి నెలకొంది. నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో వరద నీటిని జలాశయం గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
జలవిద్యుత్ ఉత్పత్తి వివరాలు
● మాచ్‌ఖండ్: 23–24 లక్ష్యం 626 మిలియన్ యూనిట్లు కాగా 535.576 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి. 24–25 లక్ష్యం 630 మిలియన్ యూనిట్లు కాగా 554.698 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది.
● అప్పర్ సీలేరు 23–24 లక్ష్యం 470 మిలియన్ యూనిట్లు కాగా 480 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. 24–25 లక్ష్యం 477 మిలియన్ యూనిట్లకు 495.7 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది.
● డొంకరాయి 23–24 లక్ష్యం 99 మిలియన్ యూనిట్లు కాగా 105.732 మిలియన్ యూనిట్లు సాధించింది. 24–25లో 95 మిలియన్ యూనిట్లు లక్ష్యానికి 105.224 మిలియన్ యూనిట్లు సాధించింది.
● పొల్లూరు 23–24 లక్ష్యం 1084 మిలియన్ యూనిట్లు కాగా 1090 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. 24–25 లక్ష్యం 1095 మిలియన్ యూనిట్లు కాగా 1120.65 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది.
లోయర్ సీలేరు ప్రాజెక్ట్
జలాశయాలకు వరద తాకిడి
పూర్తిస్థాయికి నీటిమట్టాలు
15,685 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జలవిద్యుత్ ఉత్పాదనకు, గోదావరి డెల్టాకు సమృద్ధిగా నిల్వలు
ఏపీ జెన్‌కో అధికారవర్గాల వెల్లడి
ఉత్పాదనకు ఢోకా లేదు
జోలాపుట్టు, బలిమెల రిజర్వాయర్లతోపాటు డొంకరాయి, గుంటవాడ జలాశయాలు కూడా పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరువలో ఉన్నాయి. దీనివల్ల ఈ ఏడాది జలవిద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఢోకా ఉండదు. గోదావరి డెల్టాకు పుష్కలంగా నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. – సీహెచ్ రాజారావు,
చీఫ్ ఇంజనీరు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్
పోర్‌బే పూర్తిస్థాయి : 930 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం: 921 అడుగులు
నీటి నిల్వలు: 0.1410 టీఎంసీలు
ఇన్‌ఫ్లో: 3750 క్యూసెక్కులు
ఉత్పత్తి మెండుగా..
ఉత్పత్తి మెండుగా..


