
మొబైల్ ఆధార్ సేవలు సద్వినియోగం
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : మొబైల్ అధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ కోరారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సిరీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో 72 ఆధార్ కిట్లు, పాఢ్యమి ఐటీ సొల్యూషన్స్ ద్వారా 150 అధార్ కిట్లను కలెక్టర్ దినేష్‌కుమార్ అందజేశారు. గిరిజన ప్రాంతంలో సిరీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ తొలి గిరిజన సాఫ్ట్‌వేర్ సంస్థగా గుర్తింపు పొంది ప్రతి మండలం, గ్రామంలో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఆధార్ అప్డేట్‌కు సంబంధించి సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలన్నారు. అ కార్యక్రమంలో జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, పీఎంయూ అధికారి గోపాల్, ఆధార్ కో ఆర్డినేటర్ డేవిడ్ పాల్గొన్నారు.