
చోరీకి గురైన ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
రంపచోడవరం: రంపచోడవరంలోని గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో లాప్‌టాప్‌లను చోరీ చేసిన నిందితులను అరెస్టు చేసినట్టు రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాల నివారణకు పోలీసులు ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కేసులో గంగవరం మండలం కొత్తాడ గ్రామానికి చెందిన కోసు అనిల్‌కుమార్, అతని స్నేహితుడు గడుతూరి రాజ్‌కుమార్‌లను అదుపులో తీసుకుని విచారించగా నేరం అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి 11 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనిల్‌కుమార్ రంపచోడవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో మూడు సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ అటెండర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహిరించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్టు చెప్పారు. ఎస్‌ఐ వెంకట్రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు నిందితులు అరెస్టు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ సాయిప్రశాంత్