అనకాపల్లి: స్థానిక జాతీయ రహదారి డైట్ కళాశాల వద్ద పట్టణ పోలీసులు ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖ ఉమ్మడి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు 5 బోలేరో వాహనాలలో చేపల మేత, చికెన్ వ్యర్థాలు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. విశాఖలో ఎన్‌ఎడీ, అక్కయ్యపాలెం, ఇతర ప్రాంతాల నుంచి వ్యర్థాలను సేకరించి తీసుకువెళుతున్నారని పోలీసులు తెలిపారు. వాహన డ్రైవర్లు బడపాటి నాగబాబు, జయమంగళ సత్యనారాయణ, బుడుమూరు బాలాసుబ్రహ్మణ్యం, మేడిశెట్టి నూకరాజు, బద్ది నాగ సత్యనారాయణలను అదుపులోనికి తీసుకుని అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రధర్‌కు అప్పగించారు. పట్టుకున్న వ్యర్థాలను విశాఖ కాపులుప్పాడలో డంపింగ్‌యార్డులో పూడ్చి, ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయడం జరుగుతుందని జోనల్ కమిషనర్ తెలిపారు.