
ఏడాదికాలంగా అభివృద్ధి జరగ లేదు
సర్పంచ్, టీడీసీ నేతల ఆవేదన
ఎటపాక: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాది కాలంగా మారుమూల గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం టీపీ వీడు గ్రామంలో సర్పంచ్ మోసం రాజులు,పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పూరేటి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ముందుగా రాష్ట్ర ఎస్టీ సంక్షేమ సంఘం చైర్మన్‌గా ఎన్నికై న ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో ప్రజాప్రతినిధులకు అధికారుల దగ్గర విలువ లేకుండా పోయిందని చెప్పారు. తాము ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని వాపోయారు. ఎమ్మెల్యే శిరీషాదేవి మండలంలో పర్యటనకు వచ్చినప్పుడు కూడా తమకు గుర్తింపు ఇవ్వడంలేదన్నారు.ధనిక వర్గాల నేతల సూచనలతో పర్యటనలు చేసి కింద వర్గాల నాయకులు,కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆవేదన చెందారు.తాము దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్నామని అయిన తమకు గుర్తింపు కరువైందని చెప్పారు. టీడీపీ సీనియర్ నాయకుడు రాఘవయ్య మాట్లాడుతూ..పోలవరం నిర్వాసితుల సమస్యతో పాటు మరెన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారే లేరన్నారు. ఇప్పటి కై నా సీనియర్ నాయకులు,కార్యకర్తలకు,ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు ఇవ్వాలని లేకుంటే గ్రామాల్లో ప్రజలకు సమాధానం చెప్పలేమని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామాల్లోని నాయకులు ,కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఈసమావేశంలో పూసం రాఘవయ్య,పూసం బాబు,రత్నాకర్,అపక రాంబాబు,చంద్రం,కుసుమరాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.