
డీఎస్సీ నుంచి ఏజెన్సీ ప్రాంత పోస్టులు మినహాయించాలి
పాడేరు: డీఎస్సీ నుంచి షెడ్యూల్డ్ ప్రాంత ఉపాధ్యా య పోస్టులను మినహాయించాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స డిమాండ్ చేశారు. ఆదివాసీలకు శతశాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించి, ఆదివాసీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను స్థానిక ఆదివాసీలతో భర్తీ చేయాలని, ఈ మేరకు టీఏసీలో తీర్మానం చేయాలన్నారు. సోమవా రం స్థానిక మోదకొండమ్మ ఆలయం ఆడిటోరియంలో స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ తాము మన్యం వ్యాప్తంగా బంద్‌లు, రాస్తారోకోలు, ర్యాలీలు చేస్తే శతశాతం ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని, తీరా ఇప్పుడు 49 శాతం రిజర్వేషన్లు అంటూగందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. హామీమేరకు తక్షణమే సమస్యలు పరి ష్కారించాలని లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళన లు నిర్వహిస్తామని చెప్పారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాల్‌దేవ్,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధనకమిటీ జిల్లాకన్వీనర్ ఎస్.ధర్మన్నపడా ల్, కోకన్వీనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.