పాడేరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లకు కొత్త వాహనాలను సమకూర్చింది. నిర్వహణ బాధ్యతను అరబిందో సంస్థకు అప్పగించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో తల్లి,బిడ్డలను ఆ అంబులెన్స్‌లలో క్షేమంగా ఇళ్లకు తరలించేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాహణ సక్రమంగా లేపోవడంతో వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో తల్లీ,బిడ్డలను సకాలంలో ఇళ్లకు చేరలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థోమత ఉన్న వారు ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు చేరుకుంటూ ఉండగా, ఆర్థిక స్థోమత లేని పేదలు మాత్రం ప్రభుత్వ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌ల కోసం ఎదురు చూస్తున్నారు.
మూలకు చేరిన 8 వాహనాలు
జిల్లాలో 33 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లు ఉన్నాయి. వీటిలో 8 వాహనాలు మూలకు చేరాయి. పాడేరు జిల్లా ఆస్పత్రి మాతా,శిశు విభాగానికి కేటాయించిన మూడు వాహనాలూ మరమ్మతులకు గురై మూలకు చేరాయి. దీంతో ఈ ఆస్పత్రిలో ప్రసవించిన మహిళలకు ఇళ్లకు చేరేందుకు నానా అవస్థలకు గురికావలసి వస్తోంది. జి.మాడుగుల మండలంలో రెండు వాహనాలు, ముంచంగిపుట్టు మండలంలో ఒకటి, పెదబయలులో ఉన్న ఒకటి, చింతపల్లిలో ఒకటి, జీకే వీధి ఒకటి మరమ్మతులకు గురయ్యాయయి. వీటితో పాటు ఇంజిన్ ఆయిల్, బ్యాటరీలు తరచూ మార్చపోవడంతో పలు వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి. టైర్లు అరిగిపోవడంతో పంక్చర్ అవుతున్నాయి. విషయాన్ని సంస్థ యాజమన్యానికి తెలియజేస్తున్న పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పడిగాపులు కాసిన తల్లులు
జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ముగ్గురు తల్లులకు, బిడ్డలకు వైద్యులు డిశ్చార్జి ఇచ్చారు. కానీ జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ఒక్క వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల పాటు వారు ఆస్పత్రిలోనే ఇబ్బందులు పడ్డారు. గున్నమామిడి గ్రామానికి చెందిన పాతున్లి విజయకుమారి, డేగలరాయి గ్రామానికి చెందిన ఆర్త్తి, పులిగొంది గ్రామానికి చెందిన కిల్లో వరహాలమ్మ తమ బిడ్డలతో వార్డుల్లోనే వాహనాల కోసం ఎదు రు చూశారు. ఎప్పటికీ వాహనాలుఅందుబాటు లోకి రాకపోవడంతో అవస్థలు పడుతూ ఆటోల్లో ఇళ్లకు చేరుకున్నారు. ఈ విషయమై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్రను సంప్రదించగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెక్స్‌లు తమ పరిధిలో ఉండవని చెప్పారు. అరబిందో యాజమాన్యం ప్రత్యేక సిబ్బందిని నియమించి, వాటిని నడుపుతోందని తెలిపారు.
ఐదు నెలలుగా వేతనాలకు నోచుకోని సిబ్బంది
ఈవాహనాల్లో పనిచేస్తున్న 31మంది డ్రైవర్లకు నెలకు రూ.7,870 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ఈ మొత్తం కూడా ఐదునెలలుగా చెల్లించడం లేదు. దీంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూమ్‌రెంట్లు, కరెంట్ బిల్లులు కట్టుకోలేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని డ్రైవర్లు తెలిపారు
మరమ్మతులతో మూలకు చేరిన వాహనాలు
డిశ్చార్జి ఇచ్చినా ఇళ్లకు వెళ్లలేని బాలింతలు
బిడ్డలతో సహా తల్లులు ఆస్పత్రిలోనే పడిగాపులు
జిల్ల్లాకు
కేటాయించిన వాహనాలు 33
మరమ్మతులకు గురైనవి 8
మొత్తం డ్రైవర్లు 31
బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు
పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లోని ఆస్పత్రులకు కేటాయించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల్లో చాలా వాహనాలు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. దీంతో బాలింతలు ఇబ్బందులకు గురవుతున్నారు. విషయాన్ని అరబిందో సంస్థకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో డ్రైవర్లకు బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలి. వాహనాలను త్వరిగతిన అందుబాటులోకి తీసుకురావాలి. లేదంటే ఉద్యమం చేయక తప్పదు.
– కూడా రాధాకృష్ణ, ఏపీ గిరిజన సమాఖ్య,
జిల్లా ప్రధాన కార్యదర్శి, పాడేరు.
త్వరలో అందుబాటులోకి తెస్తాం
జిల్లా వ్యాప్తంగా మరమ్మతులకు గురైన ఎనిమిది వాహనాలను త్వరలో అందుబాటులోకి తెస్తాం. వీటిలో నాలుగు వాహనాలను మూడు రోజుల్లో అందుబాటులో ఉంచుతాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంస్థకు బిల్లులు జమకాకపోవడంతో డ్రైవర్ల వేతనాలు చెల్లించడం లేదు. త్వరలో చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.
–దుర్గా ప్రసాద్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ జిల్లా కోఆర్డినేటర్
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సుస్తీ
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సుస్తీ
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సుస్తీ
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సుస్తీ