
వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ ప్రధాన లక్ష్యం
సాక్షి, పాడేరు: జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ ప్రధాన లక్ష్యమని, ప్రకృతి వైపరీత్యాలపై రైతులకు ముందస్తుగానే సమాచారం అందించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో అగ్రి స్టాక్‌పై జిల్లా స్థాయి కమిటీ నిర్వహణకు సంబంధించి మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, మత్స్య, ఉద్యానవన, సెరీకల్చర్, ఇరిగేషన్, ఇన్యూరెన్స్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్, మార్కెటింగ్, విలేజ్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, కిసాన్ క్రెడిట్ కార్డులపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతు సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతం చేసి, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వభరత్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆగస్టు 2 నుంచి ఆకాంక్ష హాట్
సంపూర్ణత అభిమాన్ సమ్మాన్ సమారో కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2 నుంచి ఆకాంక్ష హాట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఎ. ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు.యాస్పిరేషన్ జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు.రంపచోడవరం డివిజన్‌లో గంగవరం, మారేడుమిల్లి, వై.రామవరంలను ఒక యాస్పిరేషన్‌గా గుర్తించినట్టు చెప్పారు. హెల్త్ అండ్ న్యూట్రీషన్, వ్యవసాయం,విద్య, మోడల్ స్కూల్, సోషల్ డవలప్‌మెంట్ వంటి ఆరు ఆంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నీతి అయోగ్ కింద జిల్లాకు రూ.10కోట్లు ప్రోత్సాహకం ఇచ్చినట్టు చెప్పారు. కాఫీ, ఇతర ఉద్యానవన పంటలను ఒక బ్రాండ్‌గా తీసుకురావడంతో గిరిజన రైతులకు మంచి ఆదాయం లభిస్తుందన్నారు.
ఇంజినీరింగ్ పనులు వేగవంతం
జిల్లాలోని పలు ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు.కలెక్టరేట్ నుంచి ఆర్‌అండ్‌బీ, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ భవనాలు, బర్త్ వెయిటింగ్ హాళ్లు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సీసీడీపీ, పీఎం జన్‌మన్ పథకంలో మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ,రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, ట్రైనీ కలెక్టర్ సాహిత్, గిరిజన సంక్షేమశాఖ అరకు ఈఈ కె.వేణుగోపాల్,పంచాయతీరాజ్ ఈఈ కొండయ్యపడాల్, పీఆర్‌ఐ ఈఈ నరేంద్రకుమార్,పలుశాఖల డీఈఈలు రామం,రవికుమార్‌లు పాల్గొన్నారు.
కిసాన్ డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలి
కిసాన్ డ్రోన్లను గిరిజనరైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. వై.రామవరం మండలం దాలిపాడుకు చెందిన శ్రీదుర్గా భవానీ గ్రూప్ సభ్యులు, డ్రోన్ పైలట్ వెంకట శివసాయికి కిసాన్ డ్రోన్‌ను కలెక్టర్ పంిపిణీ చేశారు.రూ.9.80లక్షల కిసాన్ డ్రోన్‌ను రూ.80 శాతంసబ్సిడీపై అందుబాటులోకి తెచ్చారు.
కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్