
ప్రకృతి సాగుపై అవగాహన
చింతపల్లి: మన్యంలో ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యానవన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శెట్టి బిందు అన్నారు. స్థానిక పరిశోధన స్థానంలో శనివారం జరిగిన ప్రకృతి వ్యవసాయం అవగాహన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోగ్యకర పంటలు దిగుబడికి జీవ, ఘనామృతాలతో కూడిన ప్రకృతి వ్యవసాయం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ పంటలు సాగుకు రైతులను అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఏవో మధుసూదనరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై వినూత్న పద్ధతులు, ఆదాయ రీతిలో పద్ధుతులు, శ్రీవరి తదితర విధానాలను వివరించడంతో పలు సూచనలు చేశారు. ఎన్‌ఎఫ్‌ఎలు కుమార్‌బాబు, బాబాజీ, చింతపల్లి యూనిట్ ఇన్‌చార్జి మోహన్, మోనిటర్‌లు రాజుబాబు, వెంకట్, సింహాచలం చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాలు వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు తదితరులు పాల్గొన్నారు.