
గిరిజన తెగల మధ్య విబేధాలు సృష్టించడం తగదు
రంపచోడవరం: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.బాబురావునాయుడు రాసిన పుస్తకంలో వాల్మీకి తెగను విమర్శిస్తూ రాయడంపై జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు గొర్లె చిననారాయణ అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. బాబురావు నాయుడు రాసిన పుస్తకంలో 34 గిరిజన తెగలు ఉండగా, కేవలం నాలుగు తెగలను ఉద్ధేశించి ప్రధానంగా వాల్మీకి తెగను విమర్శిస్తూ, జిల్లాలో 546 వాల్మీకి కుటుంబాలు మాత్రమే ఉన్నట్లుగా రాజకీయ కుట్రలో భాగంగా తప్పుడు లెక్కలు చూపించినట్లు ఆరోపించారు. బాధ్యత గల రిటైర్డ్ ఐఏఎస్ అదికారి అయి ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా గిరిజన తెగల మధ్య విబేధాలు సృష్టించడం సరికాదన్నారు.బాబురావునాయుడు రాసిన పుస్తకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాల్మీకి గిరిజనుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. తెగల మధ్య విబేధాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.