
ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నా
మూడు రోజులుగా జ్వరంగా వుండడంతో గ్రామంలో మందులు వేసుకున్నా. అయినప్పటికీ తగ్గకపోవడంతో గురువారం చింతూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాను. రక్తపరీక్ష చేసి మలేరియా జ్వరంగా చెప్పారు. ఆస్పత్రిలో ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నా.
– ముచ్చిక సంతోష్,
సరివెల, చింతూరు మండలం
మెరుగైన చికిత్స అందిస్తున్నాం
వాతావరణ మార్పుల నేపథ్యంలో చింతూరు డివిజన్లో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు చింతూరు డివిజన్లోని 8 పీహెచ్‌సీల్లో 515 మలేరియా కేసులు నమోదయ్యాయి. హాట్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించి దోమల నివారణ చర్యలు చేపడుతున్నాం. మరణాలు సంభవించకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
– డాక్టర్ పుల్లయ్య,
డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో, చింతూరు