
మహాలక్ష్మి నమోస్తుతే
● ఘనంగా శ్రావణమాస పూజలు
సాక్షి,పాడేరు: పవిత్ర శ్రావణమాసం ప్రారంభంతో తొలి శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని దేవతామూర్తుల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. జిల్లా కేంద్రం పాడేరులోని మోదకొండమ్మతల్లి, రాజరాజేశ్వరిదేవి, కనకదుర్గమ్మతల్లి, మహాలక్ష్మి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.అలాగే సుండ్రుపుట్టు సాయిబాబా ఆలయంలోను వరలక్ష్మిదేవి విగ్రహానికి పూజలు చేశారు.అరకులోయలోని భ్రమరాంబిక దేవి సమేత శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలోను అమ్మవారికి పూజలు చేశారు. కుంకుమార్చన జరిపారు.

మహాలక్ష్మి నమోస్తుతే