పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మలత 94 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత స్థాయి పరిశీలన జరిపి త్వరితిగతిన పరిష్కారించాలని సూచించారు.
కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి
అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. అర్జీదారులు ఎప్పటికప్పుడు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తమ సమస్య ఎంత వరకు పరిష్కారమైందో తెలుసుకోవచ్చన్నారు. తమ అర్జీలను నమోదు చేసుకునేందుకు MEEKOSAM.AP.GOV.IN వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు. ప్రజలంతా ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, పంచాయతీరాజ్, ఆర్‌ఆండ్‌బీ ఈఈలు కొండయ్య పడాల్, బాల సుందరబాబు, డీఎల్‌పీవో కుమార్, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్‌బాబు, ఎస్‌టీవో కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
లేకుంటే చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరిక
మీకోసంలో 94 వినతుల స్వీకరణ
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ