నిర్మల్‌టౌన్: కార్తిక మాసం పురస్కరించుకు ని ఆర్టీసీ నిర్మల్ డిపో నుంచి ఈ నెల 30న పంచారామాలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ బస్సు మధ్యాహ్నం 1:30 గంటలకు నిర్మల్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్‌లో ని అమరారామం, సోమారామం, క్షీరారా మం, ద్రాక్షారామం, కుమారారామం పుణ్యక్షేత్రాలకు వెళ్తుందని వివరించారు. డిసెంబర్ 2న ఉదయం 5 గంటలకు తిరిగి నిర్మల్ చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ యాత్రకు రానుపోను కలిపి ఒక్కొక్కరికి రూ.3,500 చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల భక్తులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాల ని సూచించారు. వివరాలకు 9959226003, 9440018549 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
విద్యుత్ తీగ తగిలి
రైతు మృతి
నేరడిగొండ: అటవీ జంతువుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తతగిలి ఓ రైతు మృతి చెందిన విషాద ఘటన మండలంలోని పీచరలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై ఇమ్రాన్‌ఖాన్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన బైరి నర్సయ్య (31) పంటను అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు చేను వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు తగలడంతో ఈ షాక్‌కు గురై మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రేమ పెళ్లి నిరాకరణతో యువతి ఆత్మహత్య
ఆదిలాబాద్‌టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వరకట్నం కోసం వేధించడంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందినట్లు టూటౌన్ ఎస్సై జీవన్‌రెడ్డి తెలిపారు. మహా రాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన రాథోడ్ వర్ష(20) ఓ వ్యక్తిని ప్రేమించింది. నిశ్చితార్థం కుదిరింది. సదరు వ్యక్తి రూ.4లక్షల వరకట్నం అడగడంతో మనస్తాపానికి గురైంది. ఈ నెల 24న పురుగుల మందు తాగింది. 25న చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై వివరించారు. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
భార్యను వేధించిన భర్తకు జైలు
బెల్లంపల్లి: భార్యను వేధింపులకు గురి చేసి కొట్టిన కేసులో భర్తకు నాలుగు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శాంతిసోని గురువారం తీర్పుని చ్చారు. బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన పీక సరితను 2015లో ఆమె భర్త రాము, కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధించి ఇంట్లో నుంచి వెళ్లగొ ట్టారు. ఇంట్లోకి రాకుండా అడ్డుకుని భర్త రాము కర్రతో బాది తీవ్రంగా గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి విచారణ జరిపా రు. కోర్టు కానిస్టేబుల్ సురేష్, ఏపీపీ కే.అజయ్‌కుమార్ పది మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నే రు రుజువైంది. దీంతో రాముకు జైలు శిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.
ఎంసీహెచ్‌లో
అరుదైన శస్త్రచికిత్స
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రసూతి సేవలకే పరిమితం కాకుండా, సీ్త్రలకు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో సేవలు అందిస్తున్నట్లు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అశోక్, ఎంసీహెచ్ ఆర్‌ఎంవో కుమారస్వామి తెలిపారు. ఈ నెల 25న ఓ మహిళకు గర్భసంచి కిందకు జారగా.. మాంచెస్టర్ ఫాదర్‌గిల్స్ సర్జరీ ద్వారా ఒక సర్విక్స్ మాత్రమే తొలగించి గర్భసంచిని సరిచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే గర్భసంచిని తీసేయడం ద్వారా ఎముకలు బలహీన పడడం, హార్ట్‌ఎటాక్ అవకాశాలు ఎక్కువ అవుతాయని, హిస్టరెక్టమీ కాకుండా కొత్త పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఎంసీహెచ్‌లో నెలలో 300కు పైగా ప్రసవాలు జరుగుతుండగా, ఇటీవల మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి గైనకాలజీ డిపార్టుమెంటులో ఐదు పీజీ సీట్లు రావడంతో వైద్య సేవలు మెరుగు పడతాయని తెలిపారు. ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


