ఎన్‌హెచ్‌–61.. యమ డేంజర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌–61.. యమ డేంజర్‌

Nov 27 2026 12:02 AM | Updated on Nov 27 2026 12:02 AM

నిర్మల్‌ జిల్లా కేంద్రం నుంచి భైంసా పట్టణానికి వెళ్లే 61వ నంబర్‌ జాతీయ రహదారి ప్రయాణికులు, స్థానికులకు ప్రాణసంకటంగా మారింది. రెండు వరుసల ఈ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరగడం, వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో నిత్యం ఈ రోడ్డు రక్తమోడుతోంది. గూడ్స్‌ వాహనాలు అతివేగంగా దూసుకెళ్తున్నాయి. ఇరుకై న చిట్యాల బ్రిడ్జిపై వాహనదారులు ఎదురెదురుగా వేగంగా వస్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. రహదారిపై పలుచోట్ల గరిష్ట వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. బోర్డుల పక్క నుంచే భారీ వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయి. ప్యాసింజర్‌ వాహనాలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదకర రీతిలో నడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దిలావర్‌పూర్‌ బస్టాండ్‌ వద్ద పాదచారులు, వృద్ధులు, విద్యార్థులు రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. టోల్‌ప్లాజా వద్ద రోడ్డుపైనే ట్రాన్స్‌జెండర్లు వాహనాలను ఆపుతూ డబ్బులు వసూలు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement