సాత్నాల: మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని.. జోగు రామన్న విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన జార ప్రశాంత్ గురువారం యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేపట్టాడు. మాజీమంత్రి జోగు రామన్న జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఇటు రైతాంగంతో పాటు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మనసు చలించిన జార ప్రశాంత్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి ధైర్యంగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్సన్ లింగారెడ్డి, విజయ్ సేట్, నోముల సంతోష్‌రెడ్డి, కోల భోజన్న, దీపక్ రావు, ముక్కెర ప్రభాకర్, బట్టు సతీష్, భూతం సుభాష్, భగవాన్ దాస్, ఉమేష్, కేశవ్, రూపేష్, బబుల్, టిల్లు, శివన్న, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.


