కొండచిలువ హతం | - | Sakshi
Sakshi News home page

కొండచిలువ హతం

Nov 27 2026 12:02 AM | Updated on Nov 27 2026 12:02 AM

నిర్మల్‌ రూరల్‌: మండలంలోని తల్వేద గ్రా మంలో గురువారం భారీ కొండచిలువను రైతులు కొట్టి చంపారు. గ్రామానికి చెందిన సాయేంధర్‌ తన పొలంలో పనిచేస్తుండగా సుమారు 15 అడుగులు కొండచిలువ కని పించింది. భయాందోళనకు గురైన యజ మాని అక్కడి నుంచి పరుగులు తీసి, గ్రామస్తులకు సమాచా రం ఇచ్చాడు. గ్రామస్తులు పొలం వద్దకు చేరుకుని భారీ కొండ చిలు వను కర్రలు, రాళ్లతో కొట్టడంతో మృతి చెందింది.

కారులో ఆవు చోరీ

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని భాగ్యనగర్‌లో గంట సురేష్‌కు చెందిన ఆవును మహారాష్ట్రకు చెందిన దుండగులు బుధవారం రాత్రి ఇన్నోవా వాహనంలో ఎత్తుకెళ్లారు. రోడ్‌పై ఉన్న ఆవును వాహనంలోని సీట్లను తొలగించి అందులో తీసుకెళ్లారు. గతంలో కూడా ఆదిలాబాద్‌ పట్టణంలో ఆవులను ఈ నిందితులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ ఎస్సై జీవన్‌రెడ్డి వివరించారు.

సెల్‌ఫోన్‌

చోరీ నిందితుల రిమాండ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: సెల్‌ఫోన్‌ చోరీకి పాల్పడిన నిందితులను ఆదిలాబాద్‌ టూటౌన్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్సై జీవన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పర్బనికి చెందిన రాజబహుగోరే ఈ నెల 25 తెల్లవారుజామున ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి నిద్రపోయాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా హిమాయత్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ మోబిన్‌, సయ్యద్‌ రహీమ్‌, కిన్వట్‌లోని బొందిడికి చెందిన అమూల్‌ జాదవ్‌ సెల్‌ఫోన్‌ చోరీ చేశారు. బాధితుడు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గురువారం నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement