నేనే రాజు.. నేనే మంత్రి.. | - | Sakshi
Sakshi News home page

నేనే రాజు.. నేనే మంత్రి..

Oct 13 2026 12:29 AM | Updated on Oct 13 2026 12:29 AM

● శాఖకు చెల్లించాల్సిన డబ్బులను తన సొంత అవసరాలకు వినియోగించినట్లు ప్రచారం. ఓ నిర్వాహకుడు తాను చెల్లించిన మొత్తాన్ని శాఖ బ్యాంకు ఖాతాలో జమ చేయలేదని గుర్తించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ● స్టేడియంలోని రెజ్లింగ్‌ హాల్లో దివ్యాంగులకు అందజేయాల్సిన బ్యాటరీ వాహనాలను నిల్వ ఉంచారు. సదరు అధికారి అందులో ఒక వా హనాన్ని తనకు సన్నిహితంగా ఉండే బంధుమిత్రుడికి అందించినట్లు చర్చ జరుగుతోంది. ● జిల్లా క్రీడా పాఠశాల ప్రవేశాల వ్యవహారంలోనూ అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఓ ప్రజాప్రతినిధి సిఫారసు చేసిన ప్రవేశాల జాబితాలోని కొందరి తల్లిదండ్రులను సంప్రదించి, ఒక్కో సీటుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించాలని బేరసారాలు సాగించినట్లు సమాచారం. ● స్టేడియంలో ఖాళీగా ఉన్న దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు గతంలో దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే, కేటాయింపు ప్రక్రియలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన వర్గానికి చెందిన వ్యక్తికే ఓ దుకాణం దక్కేలా సంబంధిత అధికారి వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. దుకాణానికి నిర్దేశించిన వినియోగానికి భిన్నంగా హోటల్‌, కూరగాయల దుకాణం నిర్వహించుకునేందుకు మౌఖికంగా అనుమతించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఆ దుకాణాన్ని మూసివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, దుకాణాన్ని ఇతరులకు అద్దెకు ఇవ్వాలని నిర్వాహకుడికి సూచించడంతో ‘టులెట్‌’ బోర్డు ఏర్పాటు చేయడం గమనార్హం. ఒకరికి కేటాయించిన దుకాణాన్ని మరొకరికి తిరిగి అద్దెకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, సంబంధిత అధికారి అండతోనే ఈ వ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తోంది.

క్రీడా శాఖలో అంతా ఆయనే..

ఉన్నతాధికారులను లెక్కచేయని అధికారి

కార్యాలయ వ్యవహారాల్లో పైరవీలు

అన్ని విషయాల్లోనూ అజమాయిషీ

ఆదిలాబాద్‌: జిల్లా క్రీడాశాఖలో ఓ అధికారి వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. కార్యాలయ వ్యవహారాల్లో ఉన్నతాధికారుల సూచనలు, ఆదేశాలను సైతం పక్కనపెట్టి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనకు అడ్డుచెప్పే ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కార్యాలయంలో ‘తాను చెప్పిందే చట్టం.. చేసిందే నిర్ణయం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినప్పటికీ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వద్ద తనకున్న పరిచయాలతో సమస్యలను సర్దుబాటు చేసుకుంటున్నారని సమాచారం. ఈ వ్యవహారాలపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారులు మారినా..

తన మాతృశాఖలో విధులు నిర్వహించాల్సిన సదరు అధికారి డిప్యూటేషన్‌పై క్రీడాశాఖలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు పలువురు ఉన్నతాధికారులు మారినా ఆయన మాత్రం అదే స్థానంలో కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా వచ్చే అధికారులతో సన్నిహితంగా ఉంటూ, వారి వద్ద తన పలుకుబడిని పెంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కార్యాలయ వ్యవహారాల్లో తన కు అనుకూలంగా పరిస్థితులను మలుచుకుంటూ, తనకు లబ్ధి చేకూరే అంశాల్లో అధికారులను ఒప్పిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. కార్యాలయంలోని ఇతర ఉద్యోగులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. కొ న్ని సందర్భాల్లో ఉన్నతాధికారులకు పూర్తి సమాచా రం అందకుండా వ్యవహారాలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే విమర్శలున్నాయి.

జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి..

క్రీడాశాఖలో ఆ అధికారి ఇష్టారాజ్యంగా వ్య వహరిస్తున్న తీరుపై జిల్లా ఉన్నతాధికారుల కు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సదరు అధికారిని మాతృశాఖకు సరెండర్‌ చేయాలని కోరడంతో పాటు, ఆయన వ్యవహారశైలిపై విచారణ జరిపించా లని సిఫార్సు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. అ యినప్పటికీ సదరు అధికారి తీరు మారకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.

ఆరోపణలు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement