ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న ‘కంది’ | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న ‘కంది’

Oct 13 2026 12:29 AM | Updated on Oct 13 2026 12:29 AM

కై లాస్‌నగర్‌: దేశంలో ఓట్‌ చోరీ, ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్‌ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడి బారాఖంబా జంక్షన్‌లో కాంగ్రెస్‌ ప్రముఖులతో కలిసి రోడ్డుపై బైఠాయించి సీఈసీ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement