వాట్సాప్‌ ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ

Oct 13 2026 12:29 AM | Updated on Oct 13 2026 12:29 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్‌ ప్రజావాణి 9492341947 నంబర్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులు, శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటి పురోగతికి చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ సేవలు, ఇతర సమస్యలపై వచ్చే వాట్సాప్‌ ఫిర్యాదుల పురోగతిపై ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

చెక్‌డ్యాం నిర్మాణ స్థల పరిశీలన

కైలాస్‌నగర్‌/ఆదిలాబాద్‌రూరల్‌: ఆదిలాబాద్‌ పట్టణ ప్రజలకు రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో లాండసాంగ్వి పంప్‌హౌజ్‌ వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లను మంజూరు చేసింది. కలెక్టర్‌ రాజర్షిషా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష సోమవారం చెక్‌డ్యాం నిర్మాణ స్థలా న్ని పరిశీలించారు. త్వరలోనే పనులను ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ ప్రభు కళ్యాణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement