బతుకమ్మ ఆడుతున్న మహిళలు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటలతో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సోమవారం మారుమోగింది. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు లయబద్ధంగా నృత్యం చేశారు. కలెక్టర్ రాజర్షి షా హాజరై మహిళలతో కలిసి నృత్యం చేసి వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీవైఎస్‌వో దయానంద్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
– ఆదిలాబాద్


