ఖానాపూర్: పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి వీధి కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలయ్యాయి. కాలనీకి చెందిన ఎలిశెట్టి శ్రీకాంత్ కుమార్తె ఆరుప్యపై దాడి చేసి గాయపరిచాయి. అదేవిధంగా రమ్య కుమార్తె తన్వికపై దాడి చేశాయి. వరుస దాడులతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీధి కుక్కల బెడద నియంత్రించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మాజీ ఎంపీటీసీ రషీద్ మృతి
ఖానాపూర్: పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ మహమ్మద్ రషీద్ (52) చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. ఆగస్టు 27న లక్ష్మణచాంద మండలంలోని బాబాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఆటో నడుపుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్ర గాయాలైన ఆయన్ను హైదరాబాద్ నిమ్స్‌కు, ఆ తర్వాత నిజామాబాద్‌కు తరలించారు. చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


