ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటల ఎదుగుదల మందగించి జైనథ్, బేల మండలాల రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ.. చనాకా–కొరాట ప్రాజెక్టు సాగునీరు వారికి బాసటగా నిలుస్తోంది. గత బీఆర్‌ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా, మాజీ మంత్రి జోగు రామన్న కృషితో చేపట్టిన ఈ ప్రాజెక్టు పంప్‌హౌస్ వద్ద ఆయన సెల్ఫీ దిగారు. అప్పుడు చేపట్టిన పనులను గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని ఈ దృశ్యం చాటుతోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్


