బాసర: బాసర గోదావరి నదిలో వృద్ధురాలు ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాసరకు చెందిన ఓని ఇందిరా (63), సంజీవరావు దంపతులు. కొంతకాలంగా నిజామాబాద్‌లోని తన కుమార్తె స్వప్న వద్ద ఉంటున్నారు. శనివారం బాసరలో తన సోదరుడు ఓని దేవిదాస్‌రావు ఇంటికి వెళ్తున్నానని, మార్గమధ్యలో గోదావరిలో స్నానం చేసి వస్తానని కుమార్తెకు చెప్పి వచ్చారు. స్నానం చేస్తుండగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగారు. తేలిన మృతదేహాన్ని సిబ్బంది, స్థానికులు గుర్తించారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ దీపక్ తెలిపారు.


