ఎకనామిక్‌ కారిడార్‌ పరిహారంపై స్పష్టత ఏది? | - | Sakshi
Sakshi News home page

ఎకనామిక్‌ కారిడార్‌ పరిహారంపై స్పష్టత ఏది?

Oct 11 2026 12:15 AM | Updated on Oct 11 2026 12:15 AM

సాత్నాల: ఎకనామిక్‌ కారిడార్‌ ప్రతిపాదిత భూముల పరిహారంపై స్పష్టత లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం భోరజ్‌ మండలంలోని గిమ్మ, కోరట గ్రామాల్లో భూ నిర్వాసితులు, రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాభావంతో ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం కోరట–చనాకా పంప్‌ హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారిడార్‌ పేరుతో రైతులను ఆందోళనకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులపై దృష్టి సారించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో మెట్టు ప్రహ్లాద్‌, రాజన్న, ఉషన్న, సావాపూర్‌ విజయ్‌ సేట్‌, భోజన్న, పురుషోత్తం, కేశవ్‌, సంతోష్‌రెడ్డి, బట్టు సతీష్‌, మహేష్‌, అడెల్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement