నేటితో ముగియనున్న అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ఫారం– 6,7,8 సమర్పణలు సైతం.. తదుపరి షెడ్యూల్.. పరిశీలననే వివాదాల మధ్య సాగుతున్న ప్రక్రియ
సాక్షి,ఆదిలాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు నేటి(బుధవారం)తో గడువు ముగియనుంది. కొత్తగా ఓటరు నమోదు కోసం ఫారం–6, అనర్హులు, తప్పుగా నమోదైన ఓటర్ల పేర్ల తొలగింపున కోసం ఫారం–7 విషయంలో ప్రక్రియపై దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అడ్రస్ మార్పు, పేరు దిద్దుబాట్లు, ఫొటో అప్‌డేట్ వంటి వివరాల సవరణ కోసం ఫారం–8 కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫారంలు అందజేసేందుకు నేడు ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత పరిశీలన కొనసాగనుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జారీ చేసిన విషయం తెలిసిందే. గత జూన్ నాటికి జిల్లాలో ఓటర్ల సంఖ్య 4లక్షల 66వేల 784 ఉండగా, ఇందులో డిజిటలైజేషన్ 4లక్షల 3వేల 625 పూర్తయింది. డెత్, షిఫ్టింగ్, డూప్లికేట్, ఆబ్సెంట్ ఆధారంగా 63వేల 159 ఓటర్లను తొలగించారు. 4లక్షల 3వేల 625 మందితో కూడిన ముసాయిదా ఓటరు జాబితాను అప్పట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భౌగోళికంగా, పోలింగ్ బూత్‌ల వారీగా అనుసంధానించడంలో జరిగే లోపాలను నో మ్యాపింగ్‌గా, డేటాబేస్‌లో సాంకేతికంగా, నమోదు సమయంలో దొర్లే తప్పులను, తేడాలను అనామలీస్‌గా పేర్కొంటూ ముసాయిదా ఓటరు జాబితాలోని లక్షన్నర ఓటర్లకు అప్పట్లో నోటీసులు జారీ చేశారు.
ఇప్పుడేం చేస్తారు..
ఫారం–6 ద్వారా వచ్చిన కొత్త ఓటర్ల దరఖాస్తుల పరిశీలన, వివిధ నోటీసుల పరిష్కార ప్రక్రియను చేపట్టనున్నారు. కొత్త ఓటర్ల ఖచ్చితమైన సంఖ్య, మొత్తం ఓటర్ల వివరాలతో కూడిన తుది జాబితాను నవంబర్ 9న విడుదల చేయనున్నారు.
మొత్తం జారీ చేసిన నోటీసులు
1,50,425
అప్పటి నుంచి ఇప్పటివరకు..
ఈ నోటీసుల జారీ తర్వాత ఫారం–6, 7,8 ల ద్వారా అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన యువత, ఇంతకుముందు ఓటు లేని వారి నుంచి కొత్త దరఖాస్తులు ఫారం–6 ద్వారా తీసుకుంటున్నారు. ఫారం–7,8 ద్వారా ఓట్లను తొలగించడం, చిరునామాలు మార్చడం లాంటి విచారణ ప్రక్రియలు చేపట్టారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఇప్పటివరకు విచారణ పూర్తయింది
75 శాతం
ఫారంల వారీగా దరఖాస్తుల వివరాలు..
ఫారం సంఖ్య వచ్చిన పరిష్కారమైనవి పెండింగ్‌లో దరఖాస్తులు ఉన్నవి
ఫారమ్–6 635 239 396
ఫారమ్–7 25 19 06
ఫారమ్–8 1696 792 904


