ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లో సమస్యలు తక్షణమే పరి ష్కరించి, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవా రం రిమ్స్ వైద్య కళాశాలలోని డైరెక్టర్ చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో చేపడుతున్న సివిల్ పనులు, విద్యుత్ మరమ్మతులు, ఆక్సిజన్ పైప్‌లైన్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిమ్స్‌లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాల నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ కోసం తక్షణమే బయోమెడికల్ ఇంజినీర్‌ను నియమించా లని ఆదేశించారు. రోగులను పరామర్శించేందుకు వచ్చే సహాయకుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డుల విధానం అమలు చేయాలని డైరెక్టర్‌కు సూచించారు. వెంటిలేటర్ల మరమ్మతుతో పాటు అవసరమైన కొత్త వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ పనులన్నీ గడువులోపు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌రావు, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, వివిధ విభాగాల అధిపతులు, ఇంజినీరింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మౌలిక వసతులు మెరుగుపర్చాలి
కైలాస్‌నగర్: జిల్లాలో పేదలకు కేటాయించిన డబు ల్ బెడ్‌రూమ్ ఇళ్లలోమౌలిక వసతులు మెరుగుపర్చి, అన్ని సౌకర్యాలతో ఇళ్లను లబ్ధిదారులకు అందుబా టులోకి తీసుకురావాలని కలెక్టర్ రాజర్షి షా అధికా రులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో డబుల్ బెడ్‌రూం నిర్మాణాల పురోగతిపై అధికా రులతో సమీక్షించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీ ల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అవుట్‌సైడ్ పెయింటింగ్, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు, జెడ్పీ సీఈవో రవి, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు మున్సిపల్ కౌన్సిలర్ల వినతి
సీసీఐ మున్సిపాలిటీకి చెల్లించాల్సిన రూ.4.44 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కౌన్సిలర్లు కోరారు. ఈమేరకు కలెక్టర్ రాజర్షి షాను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందిస్తూ బకాయిల విషయమై గతంలో పలుమార్లు ఢిల్లీస్థాయి అధికారులతో మా ట్లాడినట్లు తెలిపారు. మరోసారి మాట్లాడతానని హామీ ఇచ్చినట్లుగా కౌన్సిలర్లు వెల్లడించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల కౌన్సిలర్లు ఉన్నారు.


