ఆదిలాబాద్(బేల): గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బేల పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది విధులు, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాల ని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వా హనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించా లన్నారు. డ్రంకెన్‌డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇందులో డీఎస్పీజీవన్‌రెడ్డి, సీఐ శ్రావణ్, ఎస్సై మధుకృష్ణ పాల్గొన్నారు.
భీంపూర్ ఠాణా తనిఖీ
తాంసి: భీంపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ శ్రా వణ్, ఎస్సై పీర్‌సింగ్ నాయక్, ఉన్నారు.


