సీఈసీ రాజీనామా చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

సీఈసీ రాజీనామా చేయాల్సిందే

Oct 6 2026 11:53 PM | Updated on Oct 6 2026 11:53 PM

● ఇండియా కూటమి నాయకుల డిమాండ్‌

కై లాస్‌నగర్‌: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ తన పదవీకి రాజీనామా చేసి ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడాలని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌ డిమాండ్‌ చేశారు. సర్‌ ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హ క్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో మంగళవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీగా వచ్చిన కూటమి నాయకులు ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అనంతరం ఆర్డీవో జగదీశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఇందుమార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్‌, నాయకులు సంజీవరెడ్డి,ప్రభాకర్‌రెడ్డి, డి.మల్లేశ్‌, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement