కై లాస్‌నగర్: ఎస్‌ఐఆర్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్ర ధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో సర్ ప్రక్రియ ప్రగతిపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, తప్పులు దొర్లకుండా డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఒకే కుటుంబసభ్యులను ఒకే పోలింగ్ కేంద్రం కిందకు వచ్చేలా రేషనలైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇందులో కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం చేయాలి
కైలాస్‌నగర్: జిల్లాలో ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పనుల పురోగతిపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉన్నతస్థాయి సమావేశం దృష్ట్యా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికా రులతో వేర్వేరుగా సమీక్షించారు.ఇందులో అదనపుకలెక్టర్లు చిత్రు,రాజేశ్వర్, ల్యాండ్ సర్వేయర్ ఏడీ ప్రభాకర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
ముదిరాజ్‌ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా
ఆదిలాబాద్: ముదిరాజ్‌ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావి స్తానని ఎమ్మెల్యే పా యల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పా ర్కులో సోమవారం ని ర్వహించిన భీమన్న పండుగ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. అంతకుముందు కోలీపూర్ కాలనీ నుంచి భీమన్న దేవుని ప్రతి మను పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా గాంధీ పార్కులోని ఆలయం వరకు శోభాయాత్రగా తీసుకువచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మాజీ మంత్రి జోగు రామన్న, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, బీసీ సంఘం నాయకులు చిక్కాల దత్తు, క లాల శ్రీనివాస్, సనాతన హిందూ ఉ త్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కు మార్ ఖత్రి, తదితరులు పాల్గొన్నారు.


