ఉత్తమ సేవలకు ప్రశంస | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు ప్రశంస

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

ఆదిలాబాద్‌టౌన్‌: విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే సిబ్బందికి ప్రశంసలే ఉత్తమ ప్రతి ఫలమని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. వా రం రోజులుగా నేరాల నియంత్రణ, ప్రజల భ ద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబర్చిన 16 మంది పోలీసు సిబ్బందికి సోమవా రం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్ర శంసాపత్రాలు అందజేశారు. గంజాయికేసుల్లో నిందితులను అరెస్టు చేయడంలో సమర్థవంతంగా పనిచేసిన ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ ఎస్సై సంజయ్‌తోపాటు సిబ్బంది మనోహర్‌, సలా ముద్దీన్‌ను అభినందించారు. అలాగే బైక్‌ దొంగతనం కేసులను ఛేదించి నిందితులను పట్టుకున్న టూటౌన్‌ సిబ్బంది క్రాంతి, నరేశ్‌లకు ప్ర శంసాపత్రాలు అందజేశారు. రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో రాత్రి వేళల్లో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న టూటౌన్‌ సిబ్బంది గజానన్‌, అరవింద్‌, శ్రీని వాస్‌, సుధాకర్‌, సాయికుమార్‌, కిశోర్‌ను స న్మానించారు. రిమ్స్‌ పరిసరాల్లో మొబైల్‌ ఫోన్‌ చోరీలను అరికట్టడంలో కృషి చేసిన స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ టి.రఘును ప్రశంసించారు. ఆపరేషన్‌ కవచ్‌లో భాగంగా చెక్‌పోస్టు వద్ద వి ధులు నిర్వహిస్తూ పశువుల అక్రమ రవాణాను అడ్డుకొని చాకచక్యంగా వ్యవహరించిన రఫీక్‌ హుల్‌ రెహ్మాన్‌, కిషన్‌, వెంకటస్వామిలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి భ కనబర్చే సిబ్బందికి ప్రశంసతో పాటు నగ దు బహుమతి కూడా అందజేస్తామని తెలి పారు. పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మ రింత పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటి, ఎన్‌.చంద్రశేఖర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement