జడ్జి కదిలివచ్చి.. వాంగ్మూలం స్వీకరించి | - | Sakshi
Sakshi News home page

జడ్జి కదిలివచ్చి.. వాంగ్మూలం స్వీకరించి

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

ఆదిలాబాద్‌టౌన్‌: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కోర్టు బయట ఉన్న నిందితుడి వద్దకే ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి బి.సి.శశికుమార్‌ వచ్చి సోమవారం విచారించారు. ఆసిఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2020లో రేణు పోశం అనే వ్యక్తి ముంజం మల్లయ్యకు రెండేళ్లపాటు తన పొలాన్ని కౌలుకు ఇచ్చాడు. ఆ తర్వాత తానే వ్యవసాయం చేసుకుంటానని ట్రాక్టర్‌తో పొలానికి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మల్ల య్య.. పోశంతో పాటు మరో ఆరుగురిపై పోలీసు స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదు చేశాడు. కేసు విచారణలో భాగంగా ఆరుగురిని కోర్టులో విచారించిన జడ్జి అనారోగ్యంతో బాధపడుతూ వాహనంలో వచ్చిన పోశం వద్దకు చేరుకొని విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement