కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఒకరు.. పింఛన్ అందించి ఆదుకోవాలని మరొకరు.. ఉపాధి కల్పించాలని మరికొందరు ఇలా వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితులు జిల్లా ఉన్నతాధికారులకు తమ గోడు విన్నవించుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు ఎస్. రాజేశ్వర్, చిత్రుతో కలిసి అర్జీలు స్వీకరించారు. సమస్యలను ఆలకించిన కలెక్టర్ వాటిని సత్వరమే పరిష్కరించి బాధితులకు సాంత్వన చేకూర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో స్రవంతి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, కలెక్టరేట్ ఏవో వర్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 109 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన ..


